: ధోని నమ్మకమే నన్ను నడిపిస్తోంది: నెహ్రా


క్రికెట్ ఆడే ప్రతి ఆటగాడు కెప్టెన్ పై నమ్మకాన్ని కలిగి ఉండాలని, కెప్టెన్ సైతం తన టీంపై అదే దృక్పథాన్ని కలిగి ఉండాలని బౌలర్ ఆశిష్ నెహ్రా తెలిపాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనపై నమ్మకం ఉంచడంతోనే మూడు వికెట్లు తీయగలిగానని నెహ్రా అన్నాడు. తాను ఇప్పటివరకూ, ట్వంటీ 20 ల్లో గానీ, వన్డేల్లో గానీ మూడు స్పెల్స్ లో బౌలింగ్ చేశానని చెబుతూ, ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోనీ 15 ఓవర్ ను ఇచ్చాడని, ఆ విషయంలో తాను సైతం ఆలోచనలో పడగా, చివరి ఓవర్లలో పరుగులను నియంత్రించాలని ధోనీ తనతో చెప్పినట్టు వివరించాడు. ఒక్కోసారి ఒక్కో ఓవర్ వేస్తూ, తన 4 ఓవర్ల కోటాను పూర్తిచేసిన నెహ్రా, మూడు వికెట్లు తీసి చెన్నై గెలుపులో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News