: 20 సెల్ ఫోన్లతో స్టార్ హోటళ్లలో హైటెక్ వ్యభిచారం... పలువురి అరెస్ట్


హైదరాబాద్ పోలీసులు మరో హైటెక్ వ్యభిచార దందాను రట్టు చేశారు. 8 మంది కలసి ముఠాగా ఏర్పడి 20 సెల్ ఫోన్లు వాడుతూ, ఆన్ లైన్ మాధ్యమంగా స్టార్ హోటళ్లలో వీరు దందా సాగిస్తున్నారని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే, ముంబైకి చెందిన సిమ్రాన్ బేగం (32) గత కొన్నేళ్లుగా హైదరాబాదులోని కొండాపూర్ లో నివాసం ఉంటోంది. గత నాలుగు నెలలుగా వ్యభిచారం నిర్వహిస్తోంది. పక్కా సమాచారంతో సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు, గచ్చిబౌలి పోలీసులు ప్లాట్‌పై దాడి చేసి సిమ్రాన్ తో పాటు డీల్లీకి చెందిన డింపుల్ (27), అబ్దుల్ సమద్ (42), షేక్ యాసిన్ (20), మోసిన్ (20), డ్రైవర్లుగా పనిచేసే ఎండి.షకీల్ (23), అజీజ్ (23), వీరికి వండి పెట్టే పని మనిషి సంధ్య (35)లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి యాక్సెంట్, ఇండికా కార్లు, 20 సెల్ ఫోన్లు, 9 సిమ్ కార్డులు, ల్యాప్ టాప్, బ్యాంక్ పాస్ బుక్‌లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ బ్యాంక్‌ ఖాతాలో రూ.2.50 లక్షలు ఉన్నాయని, వీటిని కోర్టుకు అందిస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News