: 19 మందిని బలిగొన్న బంగారం గని


ఆఫ్రికాలోని టాంజానియాలో చట్ట విరుద్ధంగా నిర్వహిస్తున్న ఒక బంగారం గని కుప్పకూలగా 19 మంది కూలీలు దుర్మరణం చెందారు. కహమా జిల్లాలో గురువారం రాత్రి గనిలో సొరంగం తవ్వుతుండగా ఈ ఘటన జరిగిందని, కూలీలు సజీవ సమాధి అయ్యారని తెలిపారు. మృతదేహాల వెలికితీత పనులు జరుగుతున్నాయని, శిథిలాల కింద మరికొంత మంది ఉండవచ్చని భావిస్తున్నామని వివరించారు. కాగా, టాంజానియాలో అక్రమంగా బంగారం తవ్వి తీయడం సర్వసాధారణం. ఆఫ్రికాలో బంగారం ఉత్పత్తి చేస్తున్న నాలుగో అతిపెద్ద దేశంగా టాంజానియా కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News