: భారీ వర్షంలో సైతం బాబు పాదయాత్ర


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భారీ వర్షంలో సైతం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. అల్పపీడన ద్రోణి కారణంగా ఉత్తరాంధ్రలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. వర్షంలోనూ అనకాపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాలను బాబు నేడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలో చిన్నారిపై అత్యాచార ఘటన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యపూరిత ధోరణికి తార్కాణం అని ఆరోపించారు. టీడీపీ అధికారంలో్కి వస్తే బాలికలకు ఆత్మరక్షణ విద్య ప్రవేశ పెడతామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News