: భూ సేకరణ బిల్లుకు కౌంటర్ గా కాంగ్రెస్ జమీన్ వాపసీ.కామ్ వెబ్ సైట్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం సవరించిన భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తోంది. ఈ క్రమంలో బిల్లుకు కౌంటర్ గా zameenwapsi.com పేరుతో వెబ్ సైట్ ను ఢిల్లీలో ప్రారంభించింది. ఇందులో భూ సేకరణకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. రెండు నెలల సెలవుల తరువాత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీకి చేరుకున్న మర్నాడు, కిసాన్ ర్యాలీకి ఒకరోజు ముందు వెబ్ సైట్ తీసుకురావడం గమనార్హం. వెబ్ సైట్ ప్రారంభం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మాట్లాడుతూ, ఈ వెబ్ సైట్ నిరంతరం అప్ డేట్ అవుతుందని, సింగిల్ క్లిక్ తోనే భూ సేకరణ గురించిన సమాచారం అందిస్తుందని వెల్లడించారు.