: ఐరాస సదస్సులో బాలీవుడ్ యువ హీరో ప్రసంగం


హిట్ చిత్రం 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్'తో బాలీవుడ్ లో అద్భుతమైన ఆరంగేట్రం చేసిన కథానాయకుడు వరుణ్ ధావన్ ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. సినీ పరిశ్రమకు వచ్చిన అతి తక్కువ సమయంలోనే యూత్ ఐకాన్ గా మారాడీ చాక్లెట్ బాయ్. ఈ పాప్యులారిటీతోనే ఐక్యారాజ్య సమితి 'యంగ్ ఛేంజ్ మేకర్స్' సదస్సులో పాల్గొనే ఏకైక సెలెబ్రిటీగా నిలిచాడు. ఐరాస సదస్సులో 'యువతపై సామాజిక అనుసంధాన వేదికల ప్రభావం' అనే అంశంపై వరుణ్ ప్రసంగించనున్నాడు. తొలుత ఐరాస ప్రతినిధులు తనను సంప్రదించినప్పుడు ఆ అంశం గురించి తనకు పెద్దగా తెలియదని ఆందోళన పడ్డాడట. తరువాత ఎలా మాట్లాడాలనే దానిపై వారు వివరించడంతో ఒప్పుకున్నాడట. ముంబయిలో ఈరోజు జరగనున్న ఈ సదస్సులో నోబుల్ శాంతి పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థి, రాజకీయ నేతలు, హాస్యనటులు, సామాజిక కార్యకర్తలు కూడా పాల్గొంటున్నారు.

  • Loading...

More Telugu News