: అవును... జీహాదీలకు మద్దతిస్తా: హఫీజ్ సయీద్
జమ్మూకాశ్మీర్ లో జరుగుతున్న జీహాదీ పోరాటానికి తాను పూర్తి మద్దతు పలుకుతానని జమాత్-ఉద్-దావా చీఫ్ హఫీజ్ సయీద్ అంటున్నాడు. కాశ్మీరీ ముస్లింలకు అండగా ఉంటున్న పాక్ సైన్యానికి, ప్రభుత్వానికి సహకరిస్తామని ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆయన అన్నాడు. దాన్ని 'పవిత్రయుద్ధం'గానే పరిగణిస్తామని తెలిపాడు. వేర్పాటువాద నేత మసారత్ ఆలం అరెస్టుపై స్పందిస్తూ, ఆయన ముస్లిం సమాజం కోసం ఎంతో చేస్తున్నాడని కొనియాడాడు. శ్రీనగర్ లో జరిగిన ఒక ర్యాలీలో పాకిస్థాన్ జెండాలను ఎగురవేసిన కేసులో ఆలంను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.