: తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి ఎన్నిక


తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీలో ఉన్న మిగిలిన పదవులకు రేపు ఎన్నికలు జరగనున్నాయని ఆయన తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం, జాతీయ నియమ నిబంధనల ప్రకారమే ఎన్నికలు జరుగుతున్నాయని వెల్లడించారు. మరోవైపు ఏపీ ఒలింపిక్ సంఘం అధ్యక్ష ఎన్నిక వివాదంగా మారింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఇప్పటికే ఎన్నికైనట్టు ప్రకటన రాగా, అది చెల్లదని, ఆయన తెలియక అలా పోటీ చేశారని మరో ఎంపీ సీఎం రమేష్ అంటున్నారు. ఏపీ ఒలింపిక్ అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్ వేయగా, ఈ నెల 19న ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ఆయనొక్కరే పోటీలో ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

  • Loading...

More Telugu News