: ఖైదీ కోరాడని...అమ్మాయిలతో గానాబజానా
రాజకీయ పలుకుబడి ఉన్న వారికి జైల్లో రాచమర్యాదలు జరుగుతాయన్నది పలు సందర్భాల్లో రుజువైన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి రాజకీయ ఖైదీ రాచవైభవం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే...2013లో భాగుపూర్ ప్రాంతంలోని యువజన కాంగ్రెస్ నేత సుఖ్ రాజ్ సింగ్ హత్యకేసు నిందితుడు స్వరణ్ సింగ్ అడిగాడని, పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలోని ఫతేగఘ్ చురియాన్ జైలు డిప్యూటీ సూపరిండెంట్ దేవీందర్ సింగ్ రణ్ ధవా అమ్మాయిలతో గానాబజానా ఏర్పాటు చేశాడు. జైళ్ల శాఖ అనుమతి లేకుడా ఖైదీలకు ఎలాంటి రిక్రియేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయకూడదు. అలాగే మహిళలను ఎట్టిపరిస్థితుల్లోనూ జైళ్లోకి అనుమతించకూడదు. ఈ నిబంధనలు బేఖాతరు చేస్తూ జైలులో దేవీందర్ సింగ్ రణ్ ధవా అమ్మాయిలతో గానాబజానా ఏర్పాటు చేయడం విశేషం. దీనిపై అమృతసర్ జైలు సూపరిండెంట్ ఆర్ కే శర్మ, ఆ రాష్ట్ర జైళ్ల శాఖ ఏడీజీపీ మీనాకు నివేదిక సమర్పించారు.