: హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనులు ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనులు ప్రారంభమయ్యాయి. ఈరోజు జీహెచ్ఎంసీ, నీటి పారుదల శాఖ అధికారులు సాగర్ ప్రక్షాళన పనులను ప్రారంభించారు. కాలువల ద్వారా హుస్సేన్ సాగర్ లోని నీటిని బయటకు తరలిస్తున్నారు. వేసవి కాలంలో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.