: చెన్నై బయల్దేరిన వైద్య బృందం


చిత్తూరు జిల్లా శేషాచలం ఎన్ కౌంటర్ ఘటనలో మృతి చెందిన వారికి పోస్టుమార్టం నిర్వహించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైద్య బృందం చెన్నై బయల్దేరి వెళ్లింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు చెందిన ప్రొఫెసర్లు, ఏపీకి చెందిన ఫోరెన్సిక్ నిపుణులు చెన్నై వెళ్లారు. వీరు శేషాచలం ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ఆరుగురికి తిరిగి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అనంతరం నివేదికను సీల్డ్ కవర్ లో సోమవారం నాటికి హైదరాబాదు కోర్టుకు సమర్పించనున్నారు. పోస్టుమార్టం నేపథ్యంలో ప్రొఫెసర్లకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News