: ఢిల్లీలో రైతులతో సమావేశమైన రాహుల్ గాంధీ


యాభై ఏడు రోజుల సెలవుల తరువాత ఢిల్లీలో అడుగుపెట్టిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారి పబ్లిగ్గా దర్శనమిచ్చారు. రాజధానిలో తన నివాసంలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం కోసం ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పలువురు రైతులు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా రేపు కాంగ్రెస్ కిసాన్ ర్యాలీ చేపడుతోంది. వివిధ అంశాలపై రైతులతో చర్చించేందుకే ఈరోజు సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఎల్లుండి (సోమవారం) నుంచి తిరిగి ప్రారంభంకానున్న రెండోదశ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాహుల్ నేతృత్వంలో ఈ ర్యాలీ నిర్వహింఛడం గమనార్హం.

  • Loading...

More Telugu News