: ఏపీ ఎంసెట్ కు హైదరాబాద్ లో పరీక్షా కేంద్రాల ఏర్పాటు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ ప్రవేశ పరీక్షకు హైదరాబాద్ లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తామని చెప్పిందని మీడియా సమావేశంలో చెప్పారు. సాయంత్రం నుంచి విద్యార్థులకు పరీక్షా కేంద్రాల ఎంపికకు అవకాశం ఉంటుందన్నారు. ఈ నెల 27లోగా వెబ్ ఆప్షన్ ద్వారా పరీక్షా కేంద్రాల కేటాయింపు ముగుస్తుందని తెలిపారు. మే 8న ఏపీ ఎంసెట్ పరీక్ష జరగనుంది. మరోవైపు మే 14న జరగనున్న తెలంగాణ ఎంసెట్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News