: హైదరాబాదు గోల్కొండ ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు...కార్డన్ సెర్చ్


హైదరాబాదులోని గోల్కొండ ప్రాంతాన్ని పోలీసులు గత అర్ధరాత్రి చుట్టుముట్టారు. సుమారు 400 మంది పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సోదాల్లో 40 జిలెటిన్ స్టిక్స్, సరైన పత్రాలు లేని 44 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 50 మంది అనుమానితులు, పాతనేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో దొరికి జిలెటిన్ స్టిక్స్, ద్విచక్రవాహనాలపై విచారణ చేపట్టారు. హైదరాబాదు నగరంలో కార్డన్ సెర్చ్ పేరిట కాలనీలను దిగ్బంధం చేస్తూ తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News