: ఆఫ్ఘనిస్థాన్ లో జంట పేలుళ్లు...22 మంది మృతి
ఆఫ్ఘనిస్థాన్ లోని జలాలాబాద్ రక్తమోడింది. అక్కడ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ ఉదయం జంటపేలుళ్లు సంభవించాయి. జలాలాబాద్ లోని కాబూల్ ప్రైవేటు బ్యాంకు సమీపంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దీనికి సమీపంలోని మున్సిపల్ భవనాల వద్ద మరో బాంబు పేలుడు సంభవించింది. రెండు ఘటనల్లో 22 మంది మృతి చెందగా, మరో 50 మంది గాయపడ్డారు. పేలుళ్లకు పాల్పడినది ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్లు అయి ఉంటారని భావిస్తున్నారు.