: సత్యం రామలింగరాజు జైల్లో ఏం చేస్తున్నారబ్బా!


సత్యం కుంభకోణం కేసులో ఏడేళ్ల శిక్ష అనుభవిస్తున్న రామలింగ రాజు హైదరాబాదులోని చర్లపల్లి సెంట్రల్ జైలులో, పుస్తకాలు చదువుతున్నారు. ఉత్థాన పతనాలను చూసిన ఆయన మౌనమునిలా పుస్తక పఠనంలో మునిగిపోతున్నారు. రోజులో 10 నుంచి 15 గంటల పాటు ఆయన రీడింగ్ రూంలోనే గడుపుతున్నారట. బయోలజీ, కెమిస్ట్రీ, సైన్స్‌ కు సంబంధించిన పుస్తకాలను ఆయన ఎక్కువగా చదువుతున్నారని అధికారులు తెలిపారు. జైలులో ఆయనకు ప్రత్యేక సౌకర్యాలేవీ కల్పించడం లేదని, అందరిలానే అల్పాహారం, భోజనం అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఆయనకు ఇంకా ప్రత్యేక పనిని కేటాయించలేదని, సోమవారం కేటాయిస్తామని వారు వెల్లడించారు. రామలింగరాజుకు జైలులో పాఠశాల, లైబ్రరీ, కంప్యూటర్ తరగతుల నిర్వహణ వంటి బాధ్యతలు అప్పగించే దిశగా జైలు అధికారులు ఆలోచిస్తుండగా, ఆయన మాత్రం లైబ్రరీ ఇన్‌ చార్జీ బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. మూడేళ్ల జైలు జీవితం పూర్తి చేసిన రామలింగరాజు మరో నాలుగేళ్లు జైలులో గడపనున్నారు. ఆయన ఇలాగే ఉంటే సత్ప్రవర్తన కారణంగా ఏడాది శిక్షాకాలం తగ్గే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News