: 'జమైకా చిరుత' రిటైర్మెంట్?


జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, రిటైర్ అయ్యేది ఇప్పుడే కాదు లెండి. 2016లో బ్రెజిల్ రాజధాని రియో డీ జెనీరోలో జరిగే ఒలింపిక్సే తన చివరి ఒలింపిక్స్ అని ఉసేన్ బోల్ట్ చెప్పాడు. రియో డీ జనీరోలోని షాంటిటౌన్ లో గల మంగూరియా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను సందర్శించేందుకు వచ్చిన సందర్భంగా బోల్ట్ మాట్లాడుతూ, 2008 బీజింగ్, 2012 లండన్ లో జరిగిన ఒలింపిక్స్ లో 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల విభాగాల్లో సాధించినట్టే 2016లో కూడా విజయం సాధించి తన కెరీర్ ముగిస్తానని చెప్పాడు. ఈ సందర్భంగా స్థానిక పిల్లలతో కలిసి బోల్ట్ పరుగుతీశాడు.

  • Loading...

More Telugu News