: జమ్మూ కాశ్మీర్ ను కేంద్రం ఓ కంటకనిపెడుతూనే ఉంటుంది: జితేంద్ర సింగ్


జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాదాన్ని, వేర్పాటు వాదాన్ని ఏమాత్రం సహించేంది లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. మస్రత్ ఆలంను అరెస్టు చేసిన సందర్భంగా తలెత్తిన ఆందోళనలపై ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితులను కేంద్రం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందని అన్నారు. పీడీపీ-బీజేపీ సిద్ధాంతాలు వేరైనప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేశాయని, సుపరిపాలన ముఖ్యమని ఆయన చెప్పారు. సుపరిపాలన అందిస్తూనే, వేర్పాటు వాదాన్ని సహించేది లేదని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News