: 'మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియా' విజేతను ఆకట్టుకున్న పానీ పూరీ
'మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియా 6 సిరీస్' విజేత షెఫ్ బ్రెంట్ ఒవెన్స్ కు మన పానీ పూరీ చాలా నచ్చిందట. 'మాస్టర్ షెప్ ఆస్ట్రేలియా 7 సీరిస్' ప్రచారం నిర్వహిస్తున్న ఒవెన్స్ భారత్ వచ్చాడు. ఈ సందర్భంగా భారత్ లోని వివిధ వంటకాలు, వీధుల్లో అమ్మే చిరుతిళ్లు రుచి చూశానని, అందులో పానీపూరీ తనను విశేషంగా ఆకట్టుకుందని చెప్పాడు. భారతీయ వంటకాల గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా సాగిందని ఒవెన్స్ వెల్లడించాడు. పానీ పూరీ, పావ్ భాజీ, వడపావ్ అన్నీ రుచి చూశానని, కారంగా ఉన్నా బాగున్నాయని ఒవెన్స్ తెలిపాడు. 'మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియా'కు ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ఆదరణ ఉంది.