: శ్రుతి హాసన్ కేసు 20కి వాయిదా


సినీ నటి శ్రుతి హాసన్ పై సిటీ సివిల్ కోర్టులో పిక్చర్ హౌస్ మీడియా వేసిన పిటిషన్ పై విచారణ ప్రారంభమైంది. కేవలం తన క్లయింటును వేధించేందుకే పిక్చర్ హౌస్ మీడియా ఆమెపై కేసు దాఖలు చేసిందని నటి శ్రుతి హాసన్ తరపు న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ స్థానంలో తమన్నా భాటియాను ఎంపిక చేశారని, షూటింగ్ కూడా జరుపుకుంటోందని ఆమె తరపు న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు. కేసులో వాదోపవాదాలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

  • Loading...

More Telugu News