: పరువు నష్టం కేసుల్లో కేజ్రీవాల్ కు ఊరట
తనపై దాఖలైన రెండు పరువు నష్టం కేసుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది. ఈ కేసుల్లో ప్రస్తుతం జరుగుతున్న విచారణలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దాంతో విచారణ ప్రక్రియ నిలిచిపోనుంది. ఈ పరువు నష్టం కేసుల్లో చట్టం వ్యవహరించే తీరును ప్రశ్నిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సుప్రీం నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది. కేజ్రీపై వేసిన రెండు కేసుల్లో ఒకటి న్యాయవాది సురేందర్ కుమార్ శర్మ 2013లో దాఖలు చేశారు. రెండవది కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ దాఖలు చేశారు.