: సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఉగ్రసింహం
సోషల్ మీడియాలో ఉగ్రసింహం ఒకటి హల్ చల్ చేస్తోంది. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, వాట్సప్ అని తేడా లేకుండా సోషల్ మీడియాను చుట్టేస్తోంది. స్తంభాన్ని పగులగొట్టుకుని వచ్చిన ఉగ్రనరసింహుని నకలు రూపంలా కనబడుతున్న ఆ సింహం ఫోటోని ప్రాణాలకు తెగించి అతీఫ్ సయీద్ అనే పాకిస్థాన్ ఫోటోగ్రాఫర్ తీశాడు. 2012లో అతీఫ్ సయీద్ లాహోర్ జూను సందర్శించిన సందర్భంగా ఆగ్రహంతో ఊగిపోతున్న ఆ సింహం కళ్లలో కెమేరా కన్ను పెట్టాడు. ఉగ్రనరసింహుని కళ్లకు కట్టినట్టు కనబడుతున్న ఆ ఫోటోని ఈ మధ్యే సోషల్ మీడియాలో అతీఫ్ పోస్టు చేశాడు. అంతే దానిని సోషల్ మీడియాలోని వీక్షకులు లైకులు, షేర్లతో అభిమానిస్తున్నారు.