: నిరుత్సాహపరచిన టీసీఎస్... ఐటీ కంపెనీలు బేజారు
గడచిన ఆర్ధిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఐటీ దిగ్గజం టీసీఎస్ ప్రకటించిన ఫలితాలు మార్కెట్ వర్గాలను సంతృప్తి పరచలేకపోయాయి. దీంతో, నేటి మార్కెట్ సెషన్ లో ఐటీ కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. టీసీఎస్ సహా మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, హెక్సావేర్ తదితర కంపెనీల వాటా విలువ 1 నుంచి 5 శాతం మేరకు తగ్గిపోయింది. మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో సీఎన్ఎక్స్ ఐటీ ఇండెక్స్ 2 శాతానికి పైగా దిగజారింది. మైండ్ ట్రీ 5 శాతానికి పైగా నష్టపోయింది. ఈ సంస్థ క్యూ-4 నికరలాభం క్యూ-3తో పోలిస్తే రూ. 141 కోట్ల నుంచి రూ. 128 కోట్లకు తగ్గింది. గురువారం ఫలితాలు ప్రకటించిన టీసీఎస్ ఈక్విటీ ఏకంగా 4 శాతం నష్టపోయింది.