: జయలలిత బెయిల్ పై గడువు పొడిగింపు
ఏఐఏడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. మే 12వరకు గడువు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అదాయానికి మించిన ఆస్తుల కేసులో గతేడాది ఆమెకు కర్ణాటక ట్రయిల్ కోర్టు జైలు శిక్ష విధించింది. తరువాత గత డిసెంబర్ 18న సుప్రీం నాలుగు నెలల బెయిల్ ఇచ్చింది. ఈ క్రమంలో రేపటితో తన బెయిల్ గడువు ముగుస్తుండటంతో జయ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.