: 'మా' డబ్బుతో 'టీ' కూడా తాగను: రాజేంద్రుడు


తెలుగు చిత్ర కళామతల్లి దయతో తాను 'మా' అధ్యక్షుడిగా విజయం సాధించానని నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. గెలిచిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం సేవ చేసేందుకు మాత్రమే వచ్చానని, అధ్యక్షుడిగా బాధ్యతలు కొనసాగించినంత కాలం 'మా' డబ్బుతో కనీసం 'టీ' కూడా తాగనని అన్నారు. తనను ఓడించడానికి వీలైనన్ని అపవాదులు వేశారని, తన తోటివారిని బెదిరించారని ఆరోపించారు. తనను ఒంటరిగా అభిమన్యుడిని చేసి యుద్ధంలో ఓడించాలని చూశారే తప్ప, తాను నట'కిరీటి' (అర్జునుడు)నని మరిచిపోయారని అన్నారు. పిరికితనం వదిలేసి ముందడుగు వేయాలని సూచించిన నాగబాబు, తమ వెన్నంటి నిలిచారని పేర్కొన్నారు. తన ప్రాణాలు పణంగా పెట్టి పేద కళాకారులకు సాయపడతానని, ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తానని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News