: కేసీఆర్ కేబినెట్ లో ఒక్క ‘మగాడు’ కూడా లేడట...రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య!
తెలంగాణ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి నిన్న ఆసక్తికర వ్యాఖ్య చేశారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాలుపంచుకున్న సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్య టీడీపీ నేతల్లో ఉత్సాహం నింపగా, టీఆర్ఎస్ నేతలను మాత్రం ఆగ్రహావేశాలకు గురిచేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్ లో ఒక్క ‘మగాడు’ కూడా లేడని రేవంత్ రెడ్డి అన్నారు. ఒకవేళ ఆ తరహా ‘మగాడు’ ఉంటే, గింటే... సదరు నేత టీడీపీ నుంచి వలస వెళ్లినవారే అయి ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ఎప్పుడు పూర్తువుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నా, కేసీఆర్ ఫాం హౌస్ లో మాత్రం ఎత్తిపోతల పథకాలు త్వరితగతిన పూర్తవుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.