: మాకు భారత పౌరసత్వమివ్వండి: పాక్ సింధీలు
పాకిస్థాన్ కు చెందిన సింధీలు తమకు భారత పౌరసత్వమివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వీసాపై మధ్యప్రదేశ్ వచ్చిన 200 మంది పాకిస్థాన్ సింధీ ప్రజలు ఇక్కడే ఉంటున్నారు. భారత పౌరసత్వం లభిస్తే పాకిస్థాన్ కు వెళ్లాల్సిన అవసరం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. వీరి దరఖాస్తులను సంబంధిత శాఖలకు పింపిస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. కాగా, గత కొంత కాలంగా పాక్ నుంచి సరిహద్దు దాటిన ప్రజలు భారత పౌరసత్వం కావాలని దరఖాస్తు చేసుకుంటున్నారు.