: 'పీకే'ను ఇంకా వీడని వివాదాలు


'పీకే' సినిమాను చుట్టుముట్టిన వివాదాలు ఇంకా వీడలేదు. వివాదాల మధ్య సినిమా విడుదల అవడం, బాలీవుడ్ సినీ చరిత్రలో రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడం, అభిమానులు సినిమాను ఆదరించడం కూడా జరిగిపోయింది. ఇప్పుడీ సినిమా ఎక్కడ ఆడుతుందో కూడా పెద్దగా తెలియదు. అయినప్పటికీ ఆ సినిమాను చుట్టుముట్టిన వివాదాలు సమసిపోలేదు. 'పీకే' సినిమాలో అమీర్ ఖాన్ పోషించిన పాత్ర తాను రాసిన పుస్తకంలోంచి తీసుకున్నారంటూ కపిల్ ఇషాపురి అనే రచయిత ఢిల్లీ హైకోర్టులో కేసువేశారు. తాను 2013లో రాసిన 'ఫరిస్తా' అనే పుస్తకంలో పాత్రను అమీర్ ఖాన్ పోషించారని ఆయన ఆరోపించారు. దీనిపై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి 'పీకే' నిర్మాతలను ఆదేశించారు.

  • Loading...

More Telugu News