: రేపు తేలనున్న ఫలితం... 'మా' అధ్యక్షులెవరో?


'మా' అధ్యక్షపదవిపై ఉత్కంఠ రేపు వీడనుంది. రేపు ఉదయం పది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. గత నెలలో జరిగిన 'మా' అధ్యక్ష పదవి ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్, జయసుధ పోటీ పడిన సంగతి తెలిసిందే. గతంలో జరిగిన ఏకగ్రీవ ఎన్నికలకు భిన్నంగా 'మా' ఎన్నికలు జరగడం విశేషం. కాగా, ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా పోటీ చేసిన రాజేంద్ర ప్రసాద్, జయసుధ పరస్పరం ఆరోపణలతో వీధికెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఓ.కల్యాణ్ అనే నటుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం, 'మా' అధ్యక్ష ఎన్నికలు సక్రమంగానే జరిగాయని, ఎన్నికలు నిర్వహించిన అధికారుల కనుసన్నల్లోనే ఓట్ల లెక్కింపు జరుగుతుందని తీర్పునిచ్చింది. దీంతో రేపు ఓట్ల లెక్కింపు జరపనున్నారు. దీంతో 'మా' అధ్యక్ష పీఠంపై రేపు సస్పెన్స్ వీడనుంది.

  • Loading...

More Telugu News