: సామాజిక మాధ్యమం గొప్పదనం...ఓ ఫోటో చేసిన సాయం!


సామాజిక మాధ్యమాల్లో సరదాగా చేసే పనులు ఒక్కోసారి ఎంతో ఆదరణను పొందుతుంటాయి. అలాగే, తాజాగా విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ తో ఉన్న ఓ పిల్లాడి ఫోటో సోషల్ మీడియాలో విపరీతమైన సందడి చేసింది. ఆ ఫోటోకి ఓ చిన్న ట్యాగ్ లైన్ పెట్టి ఎన్ని రకాలుగా నెటిజన్లు వాడుకున్నారో చెప్పనలవికాదు. ఆ ఫోటోను ఆ బాలుడి తల్లి లెనీ గైనర్ సరదాగా తీసి 2007 ఆగస్టు 26న సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అప్పటి నుంచి అది అందరి అకౌంట్లలోనూ చక్కర్లు కొట్టింది. ఇంటర్నెట్ లో సుదీర్ఘకాలం ఆదరణ పొందిన ఫోటోల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఆ బాలుడు (సామీ గైనర్) ఫేస్ బుక్ లో కనిపించాడు. ఈ సారి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తన తండ్రికి అవయవ మార్పిడీ చేయాల్సి ఉందని, దానికి 47 లక్షల వరకు ఖర్చవుతుందని, దాతలు స్పందించాలని కోరాడు. అతని పిలుపుకి విశేషమైన స్పందన వచ్చిందట. వేలాది మంది ముందుకు వచ్చి అతడికి సహాయం చేశారట. అతను 47 లక్షలు అడిగితే 50 లక్షల వరకు వచ్చిందట. కొంత మంది అయితే కిడ్నీలు ఇచ్చేందుకు కూడా ముందుకు వచ్చారని బాలుడు హర్షం వ్యక్తం చేశాడు. సామాజిక మాధ్యమాలు మంచికి వినియోగించుకుంటే చాలా ఉపయోగం ఉంటుందని ఈ సందర్భంగా నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News