: డ్రగ్స్ తీసుకున్న పాక్ క్రికెటర్... రెండేళ్ల నిషేధం!


కరాచీలో జరగనున్న పెంటాంగ్యులర్ క్రికెట్ కప్ పోటీల సందర్భంగా ఆటగాళ్లకు నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో పాకిస్థాన్ స్పిన్నర్ రజా హసన్‌ మాదకద్రవ్యాలు తీసుకుంటున్నట్లు రుజువైంది. అతని నుంచి సేకరించిన రెండవ రక్త నమూనాలు పరీక్షించిన ప్రపంచ యాంటి డోపింగ్ ఏజెన్సీ డ్రగ్స్ సేవించినట్టు తేల్చింది. దీంతో రజా హసన్‌ పై ఆ దేశ క్రికెట్ బోర్డు కనీసం 2 సంవత్సరాలపాటు నిషేధం విధించే అవకాశం ఉన్నట్టు సమాచారం. రజా మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు పరీక్షల్లో రుజువవడంతో క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పాక్ అధికార వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News