: ఇకపై రాహుల్ దూకుడుగా వుంటారట!
దాదాపు రెండు నెలల తరువాత స్వదేశానికి తిరిగొచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వెంటనే కార్యరంగానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 19న కిసాన్ ర్యాలీ నిర్వహించనున్నారట. ఆ పార్టీ నేత ఆనంద్ శర్మ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా చేయనున్న నిరసనకు రాహుల్ నేతృత్వం వహిస్తారని చెప్పారు. "రాహుల్ సెలవుపై వెళ్లడంలో ఎలాంటి తప్పులేదు. ప్రస్తుతం రాహుల్ తిరిగొచ్చారు. ఇకపై చాలా దూకుడుగా ఉంటారు. బిల్లుపై నిరసన చేబట్టాలన్నది రాహుల్ ఆలోచనే" అని పేర్కొన్నారు.