: రాహుల్ ఎక్కడికి వెళ్లారో తెలిసింది!


దాదాపు రెండు నెలల దీర్ఘకాలం పాటు సెలవుపై వెళ్ళిన కాంగ్రెస్ నేత రాహుల్ మయన్మార్ లోని ప్రముఖ ధ్యాన కేంద్రం యాంగాన్ లో గడిపారని తెలుస్తోంది. ఆయన ఢిల్లీకి థాయ్ ఎయిర్ వేస్ విమానంలో ఇండియాకు తిరిగి వచ్చారు. వాస్తవానికి ఆయన బుధవారం రాత్రి ఢిల్లీకి రావాల్సి ఉందని, అయితే కనెక్టింగ్ విమానం ఆలస్యం కావడంతో నేటి ఉదయం ఢిల్లీ చేరారని తెలుస్తోంది. ఈ రెండు నెలల పాటు తన ప్రత్యేక భద్రతా సిబ్బంది బదులు థాయ్ ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీతోనే ఉన్నారని సమాచారం. కాగా, 19న జరిగే కిసాన్ ర్యాలీని ఆయన ముందుండి నడిపిస్తారని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. రాహుల్ టూర్ పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

  • Loading...

More Telugu News