: హైకోర్టులో మునియమ్మాళ్ కంటతడి: ప్రతిసారీ సానుభూతి పనిచేయదన్న చీఫ్ జస్టిస్
హైకోర్టులో శేషాచలం ఎన్ కౌంటర్ కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నిన్నటి మాదిరిగానే నేటి విచారణకు కూడా ఎన్ కౌంటర్ లో చనిపోయిన శశికుమార్ భార్య మునియమ్మాళ్ హాజరయ్యారు. విచారణలో భాగంగా మృతదేహాలకు మరోమారు పోస్టుమార్టం నిర్వహించాలని మునియమ్మాళ్ కోర్టును కోరారు. దీనిని ప్రభుత్వ తరఫు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా మునియమ్మాళ్ కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో కాస్త విసుగు ప్రదర్శించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా కల్పించుకుని, కోర్టు హాలులో ఇలా కన్నీటిపర్యంతం కావడం సబబు కాదని మునియమ్మాళ్ కు సూచించారు. అయినా కోర్టుల్లో ప్రతిసారీ సానుభూతి పనిచేయదని కాస్త కటువుగానే ఆయన మునియమ్మాళ్ ను మందలించారు.