: సల్మాన్ కోసం ఏదైనా సరే చేస్తా: ప్రీతి జింటా
బాలీవుడ్ అందాల భామ ప్రీతి జింటా, నటుడు సల్మాన్ ఖాన్ మంచి స్నేహితులు. అందుకే గతంలో సల్మాన్ నటించిన ఓ చిత్రంలో అడగ్గానే ఐటమ్ సాంగ్ చేసింది. తాజాగా ఈ విషయంపై అమ్మడు మాట్లాడుతూ, "చివరిగా నేను చేసిన ఐటమ్ సాంగ్ సల్మాన్ కోసమే చేశాను. ఎందుకంటే, తనంటే చాలా ఇష్టం. తను నా మిత్రుడు. తన కోసం ఏదైనా సరే చేస్తా" అని తెలిపింది. నిజానికి తాను ఐటమ్ నంబర్స్ చేసే వ్యక్తిని కానని, నటిని మాత్రమేనని పేర్కొంది. డాన్స్ అంటే తనకు ఇష్టమేనని అయితే, ఇంట్లో కానీ లేదా క్లబ్ కు వెళ్ళినప్పుడు కాని చేస్తానని ప్రీటి అంటోంది. కొంతకాలం నుంచి బిజినెస్ లో తీరిక లేకుండా గడిపిన ప్రీతి తాజాగా 'నాచ్ బలియే 7' అనే రియాలిటీ డాన్స్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే అమ్మడు పైవిధంగా స్పందించింది.