: పర్యటన వివరాలు వెల్లడించవద్దు: భద్రతా సిబ్బందికి రాహుల్ హుకుం!


అసలే పార్లమెంటులో కీలకమైన బడ్జెట్ సమావేశాలు. ఆపై లోక్ సభలో పదో వంతు కూడా లేని సభ్యుల బలం. అధికార పక్షంపై దాడి చేయాలంటే ఏ ఒక్కరు తగ్గినా, ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవేవీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని నిలువరించలేకపోయాయి. సరిగ్గా బడ్జెట్ సమావేశాలకు ముందు రెండు వారాల పాటు సెలవు పెట్టేసి చెక్కేశారు. అసలే పరాజయం...ఆపై అధికార పక్షం ముప్పేట దాడి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయనకు రెండు వారాల సెలవంటే, జనం కూడా సరేలే అనుకున్నారు. తీరా రెండు వారాల సెలవును ఆయన రెండు నెలల పాటు పొడిగించారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు తెరతీయడమే కాక, ప్రజలకు పట్టరాని ఆగ్రహం తెప్పించారు. సరేలే వచ్చేశారుగా, ఎక్కడికెళ్లారో చెప్పి ప్రజలను శాంతపరుస్తారనుకుంటే, రాహుల్ గాంధీ తన మొండి పట్టుదలను వీడేలా కనిపించడం లేదు. పర్యటన వివరాలను బటయకు వెల్లడించడానికి వీల్లేదంటూ ఆయన తన భద్రతా సిబ్బందికి హుకుం జారీ చేశారట. మరి ఈ తరహా చర్యకు సంబంధించి రాహుల్ పై ప్రత్యర్థి పార్టీలు ఏ విధంగా విరుచుకుపడతాయో చూడాలి.

  • Loading...

More Telugu News