: మోడల్ పూజ మిశ్రాపై లైంగిక దాడి?...పోలీసులకు ఫిర్యాదు!
ప్రముఖ మోడల్, బిగ్ బాస్ సీజన్-5 పోటీదారు పూజా మిశ్రా, తనపై లైంగిక దాడి జరిగిందని ఉదయ్ పూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ దాడికి పాల్పడింది ఎవరో తనకు తెలియదని, అయితే, సోనాక్షి సిన్హా, ఆమె తల్లి పూనం, ఇషా కోపికర్, వేణు గోపాల్ ధూత్ లు వీరిని ప్రేరేపించి ఉండవచ్చని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను మోడల్ గా పనిచేసిన ఒక క్యాలెండర్ లాంచింగ్ కు వచ్చి రాణి రోడ్డులోని ఒక హోటల్ లో దిగానని ఆమె వివరించారు. రాత్రి తన భోజనంలో ఏదో కలిపారని, భోజనం తరువాత తన తల తిరుగుతున్నట్టు అనిపించిందని తెలిపారు. నిద్రలేచిన తరువాత తనపై లైంగిక దాడి జరిగినట్టు తెలిసిందని, ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగిందని పేర్కొన్నారు. తన డబ్బు, ఆభరణాలు దోచుకుపోయరని ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 345 కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఉదయ్ పూర్ డీఎస్పీ గోపాల్ సింగ్ తెలిపారు.