: వివేక్ ఒబెరాయ్ కు 'దాదా సాహెబ్ ఫాల్కే ప్రైడ్ -2015' పురస్కారం


తన విభిన్నమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కు ప్రతిష్ఠాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే ప్రైడ్ -2015' పురస్కారం ప్రకటించారు. వినోదాత్మక రంగంలో నటన, నిబద్ధత, విభిన్నతకు గానూ అతనికి ఈ గౌరవం దక్కింది. దానిపై వివేక్ స్పందిస్తూ, చాలా తక్కువ వయసులోనే ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రకటించడం పట్ల సంతోషంగా ఉన్నానని ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. తన నటనను ప్రోత్సహిస్తూ పురస్కార ఫౌండేషన్ వారు అవార్డు ప్రకటించినందుకు గానూ ధన్యవాదాలు తెలిపాడు. ఈ అవార్డును దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫౌండేషన్ వారు ప్రదానం చేయనున్నారు. 2002లో 'కంపెనీ' చిత్రం ద్వారా బాలీవుడ్ కు పరిచయమైన వివేక్ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పటినుంచీ పలు చిత్రాల్లో నటిస్తూ వస్తున్నాడు. 2006లో సంభవించిన దారుణమైన సునామీ ధాటికి నాశనమైన ఓ గ్రామాన్ని పునరుద్ధరించేందుకు తనదైన సాయం అందించాడు. ఇంకా పలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నాడు.

  • Loading...

More Telugu News