: ముందు సన్మానం, ఆపై పరువునష్టం కేసులో కోర్టుకు పొన్నం!


పార్లమెంట్ మాజీ సభ్యుడు పొన్నం ప్రభాకర్ ఇవాళ సూర్యాపేట కోర్టకు హాజరయ్యారు. మంత్రి జగదీశ్ రెడ్డి వేసిన పరువునష్టం దావా కేసులో, విచారణ నిమిత్తం ఆయన సూర్యాపేట కోర్టుకు హాజరయ్యారు. మంత్రి జగదీశ్ ఇంజనీరింగ్ కాలేజీల నుంచి భారీఎత్తున ముడుపులు స్వీకరించారని పొన్నం తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలతో తన పరువుకు నష్టం ఏర్పడిందని జగదీశ్‌ రెడ్డి కేసు దాఖలు చేశారు. కాగా, అంతకుముందు సూర్యాపేట వచ్చిన సందర్భంగా పొన్నం ప్రభాకర్ ను ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సన్మానించారు. పొన్నం ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తిగా గుత్తా అభివర్ణించారు.

  • Loading...

More Telugu News