: వరంగల్ లో నలుగురు అరెస్ట్... సూర్యాపేట షూటర్స్ అనుచరులుగా అనుమానం!
వరంగల్ లో పోలీసులు కొద్దిసేపటి క్రితం నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆ తర్వాత వీరికి సూర్యాపేట కాల్పుల ఘటనతో సంబంధమున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. గుట్టుచప్పుడు కాకుండా వారిని రహస్య ప్రదేశానికి తరలించిన పోలీసులు, మరిన్ని వివరాలను రాబట్టే పనిలో పడ్డారు. ఇప్పటికే మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో సూర్యాపేట షూటర్స్ ఓ గదిని అద్దెకు తీసుకున్నారని రూఢీ కావడం, వరంగల్ లో అరెస్టైన నలుగురికి వారితో సంబంధాలున్నాయన్న అనుమానాలతో తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు.