: హోటల్ వంటగదిలో భార్యను హత్యచేసి పారిపోయిన ఎన్ఆర్ఐ... పట్టిస్తే బహుమతి


అమెరికా, మేరీలాండ్ లోని డంకెన్ డోనట్స్ రెస్టారెంట్ కిచెన్ లో ఇండియన్ యువతి హత్య జరిగింది. విచారణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఉపాధికోసం అమెరికా వెళ్లిన భారత జంట చేతన్ భాయ్ పటేల్, పాలక్ పటేల్ లు ఈ రెస్టారెంట్ లో పని చేస్తున్నారు. విధినిర్వహణలో భాగంగా, ఒక పోలీసు అధికారి హోటల్ ను తనిఖీ చేయగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెను తీవ్రంగా కొట్టి చంపేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడికాగా, ఆ తరువాత నుంచి చేతన్ కనిపించడంలేదు. భార్యను హత్య చేసి చేతన్ తప్పించుకుపోయాడని పోలీసులు తెలిపారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతిని ఇస్తామని ప్రకటించారు.

  • Loading...

More Telugu News