: జీహెచ్ ఎంసీ ఎన్నికల నిర్వహణ జాప్యంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల జాప్యంపై హైకోర్టు ఈరోజు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మీరు నిర్వహిస్తారా? లేక మేము జోక్యం చేసుకోవాలా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఒకవేళ రాష్ట్ర ఈసీ ఎన్నికలు నిర్వహించకపోతే, ఆ పనిని కేంద్ర ఎన్నికల కమిషన్ కు అప్పగిస్తామని స్పష్టం చేసింది. గతంలో ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం 249 రోజుల గడువు కోరింది. మరో అభ్యర్థనలో 150 రోజుల గడువు కోరింది. ఇలా గందరగోళానికి గురయ్యేలా ఉన్న ఈ గడువుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇలా ప్రతిసారీ గడువు కోరడం సబబుకాదని చెప్పింది. మీరు నిర్ణయం తీసుకోకుంటే మేమే కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీచేస్తామని తేల్చి చెప్పింది. 200 వార్డుల విభజనపై నేడు కోర్టుకు ప్రభుత్వం నివేదిక అందించింది. తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News