: ఆర్ బీఐ గవర్నర్ కు బెదిరింపు ఈ-మెయిల్


రిజర్వు బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ కు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ లో ఏముందంటే, '52 ఏళ్ల భారతదేశ సెంట్రల్ బ్యాంకు హై ప్రొఫైల్ గవర్నర్ ను హతమార్చేందుకు డబ్బు చెల్లించాము' అని ఉంది. ఈ నెల మొదట్లో వచ్చిన ఈ మెయిల్ కు సంబంధించి కేసు నమోదైంది. ప్రస్తుతం ముంబయి సైబర్ క్రైం దర్యాప్తు విభాగం వారు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎవరో ఆకతాయిలు ఇలా చేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నప్పటికీ, సీరియస్ గా తీసుకున్నారని సమాచారం. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News