: నిన్న అన్ని రైళ్లను గంటల తరబడి ఆపింది ఒక వానరం అట!
వరంగల్ జిల్లాలోని పలు రైల్వే స్టేషన్లలో ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిచి పోవడానికి కారణం ఒక కోతి చేసిన చేష్టలు కారణమట. ఎల్గూరు రంగంపేట రైల్వే స్టేషన్ హైటెన్షన్ విద్యుత్ వైర్లను పట్టుకొని ఒక కోతి ఫీట్లు చేస్తుండడంతో షార్ట్ అయి వైర్లు తెగి మంటలు లేచాయి. దీంతో ఆ మార్గంలో ఉన్న రైళ్లు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అధికారులు కల్పించుకొని రైళ్లను పునరుద్ధరించేందుకు మూడు గంటలకు పైగానే సమయం పట్టింది. ఈ మూడు గంటలూ కేసముద్రంలో తమిళనాడు ఎక్స్ ప్రెస్, గుండ్రాతిమడుగు వద్ద శాతవాహన ఎక్స్ ప్రెస్, నెక్కొండ సమీపాన సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, మహబూబాబాద్ లో కోణార్క్ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.