: రూ.100 కోట్లు అడ్వాన్స్ తీసుకుని మొద్దు నిద్ర పోతారా?: ఏఎమ్మార్ కాంట్రాక్టర్ పై టీ సర్కారు ఆగ్రహం
నల్గొండ జిల్లా తాగు, సాగు నీటి అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పనుల్లో కాంట్రాక్టర్ మొద్దు నిద్ర పోతున్నారట. నిధులేమైనా అందలేదా? అంటే, అడ్వాన్సుగానే రూ.100 కోట్లు అందుకున్నాడట. అడ్వాన్సులు తీసుకున్న కాంట్రాక్టర్ పనులపై దృష్టి సారించకపోవడంపై తెలంగాణ సర్కారు నిన్న ఆగ్రహం వ్యక్తం చేసింది. డబ్బులు తీసుకుంటే సరిపోతుందా? పనులు చేయాలన్న బుద్ధి లేదా? అంటూ అక్షింతలేసింది. నిన్న జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సదరు కాంట్రాక్టర్ పై ఒత్తిడి చేసైనా పనులు చేయించండని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నల్గొండ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.