: ఒవైసీకి తగిన సమాధానం చెప్పారు: ఉద్దవ్ ఠాక్రే
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ముంబై ముస్లిం ఓటర్లు తగిన సమాధానం ఇచ్చారని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. బాంద్రా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి విజయం సాధించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తమ పార్టీని గెలిపించిన ఓటర్లు, ముంబైలో ఎంఐఎం స్థానం ఏమిటో స్పష్టం చేశారని ఎద్దేవా చేశారు. కాగా, బాంద్రా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో శివసేన అభ్యర్థి తృప్తి సావంత్ భారీ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. శివసేన పార్టీ పులి అని, తమను ఆపడం ఎవరి తరం కాదని ఆయన చెప్పారు. విజయం ఘనత ప్రజలు, పార్టీ కార్యకర్తలకు చెందుతుందని ఠాక్రే పేర్కొన్నారు.