: రణబీర్ తో నటించడం ఇష్టం!: కంగనా


బాలీవుడ్ క్రేజీ యువ హీరో రణ్ బీర్ కపూర్ తో నటించడం తనకు ఇష్టమని నటి కంగనా రనౌత్ చెప్పింది. గత ఏడాది కంగనా 'క్వీన్' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. 'క్వీన్' సినిమాలో నటనకు రణ్ బీర్ ఇచ్చిన ప్రోత్సాహం మరవలేనని కంగనా చెప్పింది. ఆయనతో నటించడం కోసం ఎదురుచూస్తున్నానని కంగనా పేర్కొంది. అయితే తన పాత్రకు తగిన ప్రాధాన్యం ఉండాలని షరతు విధించింది. నటుడిగా రణ్ బీర్ ను ఆరాధిస్తానని కంగనా కొసమెరుపునిచ్చింది. కాగా, 'క్వీన్' సినిమాకి కంగనా జాతీయ ఉత్తమనటి పురస్కారం పొందిన సంగతి తెలిసిందే. రణ్ బీర్ కపూర్ మాట్లాడుతూ, తనకు కంగనాతో నటించడం ఇష్టమేనని చెప్పారు.

  • Loading...

More Telugu News