: డెక్కన్ క్రానికల్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డికి బెయిల్


డెక్కన్ క్రానికల్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డికి నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ పేరిట వందల కోట్ల రూపాయలకు బ్యాంకులను మోసం చేసిన కేసులో వెంకట్రామిరెడ్డి రిమాండ్ ఖైదీగా చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అతని బెయిల్ పై విచారించిన నాంపల్లి కోర్టు, 5 లక్షల రూపాయలు న్యాయస్థానానికి పూచీకత్తు సమర్పించాలని, మరిన్ని షరతులతో న్యాయస్థానం వెంకట్రామిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. బ్యాంకులను మోసం చేయడంతో ఐపీఎల్ లో డెక్కన్ ఛార్జర్స్ జట్టును గవర్నింగ్ బాడీ స్వాధీనం చేసుకుని వేలం నిర్వహించి సన్ యాజమాన్యానికి అప్పగించిన సంగతి తెలిసిందే. అదే జట్టు సన్ రైజర్స్ హైదరాబాదుగా పరిగణించబడుతోంది.

  • Loading...

More Telugu News