: రాజమండ్రిని భయపెడుతున్న బైక్ విన్యాసాలు


బైక్ విన్యాసాల సంస్కృతి రాజమండ్రి లాంటి చిన్న పట్టణాలకు కూడా పాకింది. రాజమండ్రిలో బైక్ విన్యాసాలు పట్టపగలు చేస్తూ, రోడ్డుపై ప్రయాణికులను భయపెడుతున్నారు. కరిజ్మా, పల్సర్, సీబీజడ్ ఎక్ర్ ట్రీమ్ వంటి బైకులపై పట్టపగలు యువకులు విన్యాసాలు చేస్తున్నారు. ఈ విన్యాసాలను సహచర యువకులు చిత్రీకరిస్తుండగా, వాట్సప్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే రాజమండ్రి పరిసరాల్లో చైన్ స్నాచర్స్ కూడా పెరిగిపోతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువకులు ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని ద్విచక్రవాహనాలపై రెచ్చిపోతున్నారని వారు ఆరోపిస్తున్నారు. విన్యాసాలు చాలా కాలంగా జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News