: జగన్ జెరూసలేం పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జెరూసలేం వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. జూన్ లేదా జులైలో వెళతానన్న జగన్ కేవలం 15 రోజులు మాత్రమే వెళ్లి రావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయనకు పాస్ పోర్టు ఇవ్వాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. జెరూసలేం నుంచి వెళ్లొచ్చాక పాస్ పోర్టును తిరిగి అప్పగించాలని జగన్ ను కోర్టు ఆదేశించింది.